Ticker

6/recent/ticker-posts

How to earn money in online in telugu by telugu World 4us

 How to earn money in online in telugu by telugu World 4us

చదువుకుంటూనో  లేదా  జాబ్ చేస్తూనో  మీకు దొరికే కొద్ది పాటి ఖాళీ  సమయంలో ఆన్లైన్ ద్వారా  డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారా అయితే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్  మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాం కాబట్టి ఫ్రెండ్స్ మీ అమూల్యమైన సమయాన్ని  ఈ పోస్ట్ చదవడానికి కేటాయించి మీరు కూడా ఇప్పుడు చెప్పబోయే ఐడియాస్ లో మీకు నచ్చిన  ఐడియా ను ఎంచుకొని మీరు కూడా  ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించడానికి మొదటి అడుగు ఈ రోజే వేయండి !!


చదువుకుంటూనో  లేదా  జాబ్ చేస్తూనో  మీకు దొరికే కొద్ది పాటి ఖాళీ  సమయంలో ఆన్లైన్ ద్వారా  డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారా అయితే


ప్రతి ఒక్కరికీ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలని ఒక చిన్న కోరిక అయితే ఉంటుంది అయితే అలా ఆ ప్రయత్నంలో చాలామంది  ఎన్నో యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకుంటారు అయితే వాటిలో కొన్ని ఫేక్  యాప్స్ తో పాటు  కొన్ని జెన్యూన్ యాప్స్ కూడా ఉంటాయి . కానీ  వాటిలో కొన్ని  జెన్యూన్ యాప్స్ ఉన్నప్పటికీ వీటి లొ డబ్బులు సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి అలా కష్టపడి నప్పటికీ మన తగినంత ప్రతిఫలం వస్తుందంటే రాదు అని చెప్పవచ్చు .

అయితే ఇప్పుడు మన కష్టానికి తగిన ప్రతిఫలం అందించే కొన్ని జెన్యూన్ గా డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాల్లో కొన్ని మార్గాలు గురించి తెలుసుకుందాం !

#1 Selling photos(ఫొటోస్ ని అమ్ముతూ డబ్బులు సంపాదించండి )


How to earn money online in telugu


ఫ్రెండ్స్ మీకు ఫొటోగ్రఫీ అంటే ఫ్యాషన్ ఆ ఫోటోలు అందంగా తీస్తారా అయితే మీరు ఫోటోను సెల్ చేస్తూ మంచి ఇన్కమ్ ఐతే సంపాదించుకోవచ్చు . ఎటువంటి ఫొటోస్ అంటే నేచర్ బోర్డ్స్ ఎనిమల్స్ వంటి ఫోటోస్ తీసి shutterstock, getty images వంటి వెబ్సైట్లో పోస్ట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అది ఏంటంటే ఈ వెబ్సైట్ లో ఫొటోస్ అప్లోడ్ చేస్తే  డబ్బులు వస్తాయి అది ఎలా ?
నిజంగా ఈ వెబ్సైట్లు మంచిగా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తుంటాయి  అది ఎలా అంటే ఒకవేళ మీరు తీసిన ఫోటో ఎవరికైనా నచ్చినట్లయితే వారు డౌన్లోడ్ చేసుకుంటారు కదా  అలా డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు కొంత అమౌంట్ అయితే వస్తుంది. ఇలా మీ ఫోటో ఆ వెబ్సైట్లో లొ  ఉన్నంతకాలం మీకు రెవెన్యూ వస్తూ ఉంటుంది.

#2 selling online courses

How to earn money online in telugu

మీకు ఏదైనా సబ్జెక్ట్ లేదా మంచి  స్కిల్స్  మీద మంచి పట్టు ఉంటే  వాటిని వీడియోస్ రూపంలో చేసి Udemy, Skillshare వంటి వెబ్ సైట్ లో పబ్లిష్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ మీరు క్రియేట్ చేసిన కోర్స్ కి ఒక అమౌంట్ అయితే సెట్ చేసుకుంటారు అలా ఆ కోర్స్ కి ఒక అమౌంట్ సెట్  చేసుకుని ఆ వెబ్ సైట్ లో పబ్లిష్ చేస్తారు  ఇప్పుడు ఎవరికైనా ఆ కోర్సు నచ్చితే వెంటనే ఆ కోర్సును కొనుక్కుంటారు ఇలా వాళ్లు కోర్సుని కొనడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి సో ఇలా  కోర్సెస్ ని అమ్మడం ద్వారా  కూడ డబ్బులు సంపాదించవచ్చు

#3 Website (బ్లాగింగ్ లేదా వెబ్ సైట్ క్రియేట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించండి)



How to earn money online in telugu


ఫ్రెండ్స్ మీకు ఏదైనా తెలియని విషయాలు ఉంటే వెంటనే గూగుల్ ఓపెన్ చేసి దానిలో  సెర్చ్ చేసి ఉంటారు అయితే వెంటనే గూగుల్ మీరు సర్చ్ చేసిన టాపిక్ కి దగ్గరగా ఉన్న వెబ్సైట్ చూపిస్తుంది అయితే మీరు వాటిలో మీకు నచ్చిన వెబ్సైట్ క్లిక్ చేసుకొని అందులో ఉన్న  ఇన్ఫర్మేషన్ చదువుతూ ఉంటారు అయితే ఇలా చదువుతూ ఉన్న సమయంలో వెబ్సైట్ పక్కన గాని కింద కానీ కొన్ని ads వస్తూ ఉంటాయి ఇలా ఆ వెబ్సైట్లో ads వేసినందుకు గూగుల్ ఆ వెబ్ సైట్ ఓనర్ కి కొంత అమౌంట్ అయితే ఇస్తుంది ఇలా ఈ website కి  ఎంత ఇవ్వాలి అనేది గూగుల్ ఎలా  నిర్ధారించుకుంటుంది అంటే ఆ వెబ్సైట్ వచ్చే వ్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ వెబ్సైట్ ఎక్కువ వ్యూస్  వస్తూ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మీకు ఒక website అయితే ఉండాలి అయితే మీకు వెబ్ సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే ఈ ఆర్టికల్ పైన క్లిక్ చేసి అసలు వెబ్ సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలుసుకోండి .
వెబ్సైట్ ద్వారా మనం ఎన్నో విధాలుగా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు ఒకటి మన వెబ్ సైట్ ని AdSense  కి కనెక్ట్ చేయడం ద్వారా మన వెబ్సైట్లో అయితే ads  ప్లేస్ అవుతూ ఉంటాయి ఇలా మన వెబ్ సైట్ లో ads ప్లేస్ చేసినందుకు గూగుల్ మనకి కొంత అమౌంట్ అయితే వస్తుంది . అలాగే ఇంకో విధంగా ఎలా earn చేసుకోవచ్చు అంటే మనం వాడే లేదా కంటెంట్ రీడర్స్ కి (ప్రేక్షకులకు)  ఉ
పయోగపడే ప్రొడక్ట్స్ లింక్స్ అనేది మన ఆర్టికల్స్ లో పెట్టడం ద్వారా ఎవరైనా వాటి పైన క్లిక్ చేసుకొని వాటిని కొనడం ద్వారా మనకి కొంత కమిషన్ అయితే వస్తుంది ఇలా ఈ విధంగా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా అయితే డబ్బులు సంపాదించుకోవచ్చు

#4  Freelancing



How to earn money online in telugu


మనలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క  నైపుణ్యం కలిగి ఉంటుంది ఒకరు బాగా logos నీ డిజైన్ చేయగలిగితే మరొకరు వీడియో ని బాగా ఎడిట్ చేయగలరు మరియు కొంతమంది అనర్గళంగా ఒక భాష నుంచి ఇంకొక భాష కు ట్రాన్స్లేట్ చేయగలరు మరికొంతమంది ఫోటోలు బాగా ఎడిట్ చేయగలరు ఇలా ప్రతి ఒక్కరికి ఒక నైపుణ్యం ఉంటుంది అయితే ఇప్పుడు మీ అద్భుతమైన నైపుణ్యంతో మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు ఇప్పుడు చెప్పబోయే వెబ్ సైట్ లో రిజిస్టర్ అవుతే మీకు కొంత సమయానికి ప్రాజెక్టు వస్తూ ఉంటాయి ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూ ఉంటే ఆ ప్రాజెక్టు ఓనర్స్ మీకు అమౌంట్ ఇస్తారు అయితే ఇప్పుడు  ఆ వెబ్ సైట్స్ ఏంటో తెలుసుకుందాం
Fiverr, freelancer.in, people per hour వంటి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ ఫామ్ లో రిజిస్టర్ అవి మీరు కూడా ఒక income source ఐతే క్రియేట్ చేసుకోండి .

#5 create YouTube channel


How to earn money online in telugu



చాలామంది తమ దగ్గర ఉండే ఖాళీ సమయాన్ని  యూట్యూబ్ లో వెబ్ సిరీస్ ,కామెడీ వీడియోస్  వంటి వీడియోస్ చూస్తూ ఉంటారు అలా చూడడం తప్పని చెప్పడం లేదు మన జీవితానికి కామెడీ అనేది ఒక పార్ట్ మాత్రమే  అలాగని మొత్తం సమయాన్ని వృధా చెయ్యకూడదు "మన జీవితంలో ఏదైనా తీసుకురాగలo కానీ గడిచిన సమయాన్ని తీసుకురాలేము కాబట్టి   మీ సమయాన్ని ఉపయోగపడే పనులకు ఖర్చు పెట్టుకుని మీ భవిష్యత్తు మంచి మార్గంలో పయనించిoడి....
ఫ్రెండ్స్ మీకు ఏదైనా టాపిక్ మీద మంచి నాలెడ్జ్ ఉండి వాటిని మంచిగా ఎక్స్ప్లైన్ చేసే మంచి నైపుణ్యం ఉంటే  మీకు యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ ఫామ్ అని చెప్పు వచ్చు యూట్యూబ్ లో చాలా మంది కొన్ని లక్షల రూపాయలు  సంపాదిస్తున్నారూ
 వారికి లాగా మీరు కూడా అంత అమౌంట్ సంపాదించుకోవచ్చు అంటే అవును అని చెప్పవచ్చు మీరు  పెట్టే efforts  మీద అ డిపెండ్ అయి ఉంటుంది మీరు జనాలకి ఒక మంచి valuable content కనక అందిస్తూ ఉంటే ఏదో ఒక సమయానికి మీకు ఆ రేంజ్ కి వెళ్ళే అవకాశం వస్తుంది అంతే తప్పించి వెంటనే యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అవ్వాలంటే అది అసాధ్యం

యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కావాలి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే ముందు ముందు వచ్చే ఆర్టికల్స్ లో తెలియజేస్తాను కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి  కంటెంట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన బ్లాగ్ ని డైలీ ఫాలో చేయండి

పైన చెప్పిన మార్గాల్లో వెంటనే success రావాలంటే రాదు  కొంత టైం పడుతుంది  ఆ టైం ఎంత అనేది మీరు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద ఎంత efforts  పెడతారు అంత రిటర్న్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు డిస్కస్ చేసిన ప్లాట్ ఫార్మ్స్ లో మీకు నచ్చిన ఒక ఫ్లాట్ ఫాం ఎంచుకొని ఈ రోజే పని మొదలు పెట్టండి.
ఇప్పుడు చెప్పిన ఐడియాస్ లో ఏదైనా ఐడియా అమల్లో పెట్టినట్లయితే ఒకవేళ దాన్నుంచి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది అంటే ఇది మన లైఫ్ లాంగ్ ఎంతో కొంత ఇస్తూ ఉంటుంది  కాబట్టి ఫ్రెండ్స్ సక్సెస్ రావడం కొంచెం టైం పట్టినప్పటికీ  మనకి లాంగ్ టైం  అమౌంట్ వస్తూ ఉంటుంది .

మీకు ఈ ఆర్టికల్ నచ్చితే  మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి !

Thank you














 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు