Motivational quotes in Telugu by telugu World 4us
- జీవితం చాలా చిన్నది
ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృథా చెయ్యకు
క్షమించడం నేర్చుకో
సంతోషంతో గడపగలవు .. !!
2) కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజమనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యమనుకోవడం ఇంకా తప్పు , చూసింది , విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు ... !!
3) ఒక దీపం వేల దీపాలను వెలిగించినట్టే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణమవ్వాలి - బుద్ధ
4) ఒక దేశం అవినీతి రహితంగా మరియు అందమైన మనస్సుగల దేశంగా మారాలంటే ముగ్గురు ముఖ్యమైన సామాజిక సభ్యులను నేను గుర్తించాను వారు తల్లి , తండ్రి మరియు గురువు - డా . అబ్దుల్ కలాం
5)ఆకలిగా ఉన్న పేదవారికి అన్నం పెట్టినంత పుణ్యకార్యం మరోటి లేదు ' - మదర్ థెరిస్సా
6) జీవితంలో ఏదైనా పోగొట్టుకో తిరిగి సంపాదించుకోగలవు నిన్ను ప్రేమించేవారు నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు తిరిగి వారి ప్రేమను వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే నీ జీవితకాలం సరిపోదు .. !!
6)ప్రతి మనిషిలో మంచి , చెడు రెండు ఉంటాయి మనలో మంచిని చూసినవాళ్ళు ఆప్తులు అవుతారు .. చెడును చూసినవాళ్ళు శత్రువులు అవుతారు రెండింటిని సమానంగా చూసినవాళ్ళే మనల్ని ప్రేమించిన వాళ్ళు అవుతారు .. !!
7)నిజంగా ప్రేమించేవారిని ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూ ఉంటుంది ప్రేమించిన వారు ఎక్కడ దూరమవుతారో .. లేక ఎవరైనా దూరం చేస్తారేమోనని భయపడతారు .. ఇది నిజం .. !!
8) కాలం మనుష్యులను మార్చదు .... కానీ కాలం గడిచే కొద్దే మనుష్యుల అసలు నైజం బయటకు వస్తుంది !!!
సమయస్ఫూర్తి చాలా అవసరం ఎప్పుడైనా ఎక్కడైనా సరే “ సమయస్పూర్తితో , ధైర్యంగా మాట్లాడడం చాలా అవసరం " ఆ ధైర్యం లేకపోతే మన ప్రాణాలను మనం పోగొట్టుకోవలసి వస్తుంది ఒక్కోసారి ..
9) రాత్రి అనేది కలలు కనేందుకు పగలు అనేది కలలు నిజం చేసుకునేందుకు
10) Sry అండ్ Ego రెండూ చాలా చిన్న పదాలు .. ! Sry అనేది ఎన్నో బంధాలను కలుపుతుంది Ego అనేది ఎన్నో బంధాలను తెంచుతుంది..
11) డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది నూనె ఉన్నంత వరకే వెలుగునిస్తుంది మనసు నుంచి పుట్టే ప్రేమ సూర్యుడిలాంటిది సృష్టి ఉన్నంతవరకూ వెలుగునిస్తుంది
12) ఏ బంధం అయినా ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు
13) నమ్మించే బంధంలో అబద్ధాల మోసం ఉంటుంది కానీ నమ్మకంగా ఉండే బంధంలో మనం ఉన్నా .. లేకపోయినా నిజాయితీగా ఉంటారు
14) నా పరిచయం ఎలా మొదలైందో ఒక్కసారి ఆలోచించుకో సమయాన్ని లెక్కచేయకుండా నాతో గడిపిన క్షణాలు గుర్తుంచుకో కాలాన్ని మైమరిపించే మెస్సేజ్ లు , ఫోన్ కాల్స్ ఒక్కసారి నీలో నిన్ను వెతుక్కో నిన్ను ఏ రోజూ ఏదీ అడగలేదు నీ సంతోషం , క్షేమం తప్ప
15) ఓ దేవుడా నాకు కోపం వచ్చినప్పుడు నా కళ్ళ నుండి కన్నీరు రానివ్వు కానీ నా నోటి నుండి మాట రానియ్యొద్దు కన్నీటితో నా కోపం పోతుంది కానీ .. మాట జారితే ఎదుటివారికి బాధే కలుగుతుంది
16) ప్రాణం పైకిపోతుంది దేహం కిందికి పోతుంది కానీ పేరు శాశ్వతంగా మిగిలిపోతుంది ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప
17) తప్పులను తన మనసులో పెట్టుకుని కేవలం ప్రేమను మాత్రమే పంచేది అమ్మ
18) ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చినా ... నిదానంగా దాట గలిగితే కింద పడకుండా వెళ్ళవచ్చు ఎంత పెద్ద సమస్య ఎదురైనా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో దెబ్బతినకుండా ఉండవచ్చు .. !
19) నీ నవ్వు వెనుక బాధని నీ కోపం వెనుక ప్రేమని మౌనం వెనుక కారణాన్ని తెలుసుకోగలిగే వారినే నమ్మండి వాళ్ళను జీవితంలో వదులుకోకండి అలాంటివాళ్ళు దొరకడం అరుదు
20) జీవితంలో ప్రేమ ఉండాలి కానీ .. ప్రేమ అనేది జీవితం కాకూడదు ఇది అర్థం చేసుకున్నవాళ్ళు జ్ఞాపకాలను తలుచుకుని బతుకుతున్నారు ఇది అర్థం చేసుకోనివాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు
21) మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం పరీక్షల్లో గెలిస్తే .. ఆ బంధం ఇచ్చే తీపి జ్ఞాపకాలతో జీవితం ఆనందంగా గడిచిపోతుంది పరీక్షల్లో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది ఈ జీవితం కచ్చితంగా ప్రతి పరిచయం , ప్రతిబంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని ఇచ్చేవెళ్తుంది
సో ఫ్రెండ్స్ పైన చెప్పిన కొటేషన్స్ నచ్చాయి అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి వారు కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ కొటేషన్స్ మిస్సవకూడని అనుకుంటే రోజు మన బ్లాగ్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫ్రెండ్స్..
0 కామెంట్‌లు