Ticker

6/recent/ticker-posts

how to create a website in telugu by telugu world 4 us

                     How to create a website in telugu




How to create a website in telugu


ఒకప్పుడు హాబీగా స్టార్ట్ అయిన బ్లాగింగ్ ఇప్పుడు చాలామందికి ఉపాధి గా మారింది ఎంతోమంది తమ బ్లాగ్స్ లేదా website ద్వారా కొన్ని వేల రూపాయలు నుంచి కొన్ని లక్షల రూపాయల దాకా సంపాదిస్తున్నారు అలా మనం కూడా సంపాదించాలంటే మనకి ఒక వెబ్సైట్ అనేది కావాలి అయితే ఈ ఆర్టికల్ లో ఒక ప్రొఫెషనల్ వెబ్ సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం

Select  A Niche

How to create a website in telugu


  • ముందుగా వెబ్సైట్ లో ఎటువంటి కంటెంటు రాయాలి అనుకుంటున్నారో అది నిర్ధారించుకోండి అంటే ఒక  niche (Topic) సెలెక్ట్ చేసుకోండి . అలా సెలక్ట్ చేసే ముందు  ఆ టాపిక్ మీద మంచి నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకొండి  అలా కాకుండా మీకు రానుటువంటి టాపిక్ ని ఎంచుకొని బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే ఏదో ఒక సమయానికి ఆ కంటెంట్ రాయడం మీద ఇంట్రెస్ట్ పోతుంది  అలా మొత్తానికి బ్లాగ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి మీకు ఏ టాపిక్ అంటే ఇష్టమో తెలుసుకొని వాటిని బాగా research చేస్తూ మంచిగా నాలెడ్జ్ తెచ్చుకొని వాటి మీద ఆర్టికల్ రాయండి ఇలా చేస్తే మీకు ఇంట్రెస్ట్ తో పాటు బ్లాగ్ చేయాలని కొత్త ఉత్సాహం వస్తుంది
పైన చెప్పిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి టాపిక్  అది హెల్త్ కావచ్చు , టెక్నాలజీ ,మొబైల్ రివ్యూస్ , education ఇలాంటి మీకు నచ్చిన టాపిక్ ఎంచుకోండి


  • ఇలా మీరు ఒక టాపిక్ ని ఎంచుకున్న తర్వాత ఒక డొమైన్ name  కొనాలి అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అసలు డొమైన్ నేమ్ అంటే ఏమిటి అని ?
How to create a website in telugu




సింపుల్గా డొమైన్ నేమ్ అంటే మీ వెబ్ సైట్ యొక్క అడ్రస్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు Facebook.com  అని  Google లో సెర్చ్ చేస్తే వెంటనే ఫేస్ బుక్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది అంటే ఇక్కడ  Facebook.com అనేది ఫేస్బుక్ వెబ్ సైట్ యొక్క అడ్రస్ అనమాట ఇలా మీరు కూడా మీ వెబ్ సైట్ కి ఒక డొమైన్ నేమ్ ఏంచుకోవాలి అలా ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గమనించండి అదేమిటంటే
మీరు ఎంచుకునే డొమైన్ నేమ్ అనేది చాలా చిన్నదిగా ఉండేలా చూసుకోండి అలాగే చేస్తే యూజర్స్ కి గుర్తుంటుంది
మీరు ఎంచుకునే డొమైన్ నేమ్ అనేది మీరు ఎంచుకున్న నిచే ( topic) కి దగ్గరగా ఉండేలా చూసుకోండి
ఉదాహరణకు మీరు Mobile Phone reviews రాయాలనుకుంటే  మీ డొమైన్ నేమ్ అనేది Mobreviews.com లాగా చిన్నదిగా మరియు మీ వెబ్సైట్ లో ఉన్న topic కి దగ్గరగా ఉండేటట్లు చూసుకోండి
మీరు ఎంచుకున్న డొమైన్ నేమ్ చివరి నా .com అని ఉండేలా చూడండి ఇలా ఎందుకంటే ఈ డాట్ కామ్ డొమైన్ అనేది చాలా పాపులర్ అయింది కాబట్టి మీ మీ వెబ్ సైట్ డొమైన్ నేమ్ చివరి నా డాట్ కం ఉండేలా చూడండి ఒకవేళ అలా లేకపోతే .in , .org   ఇలాంటి  domains అయినా సరే పర్వాలేదు.
అలా మీరు ఒక డొమైన్ నేమ్ ఫిక్స్ అయిన తర్వాత ఆన్లైన్లో అది  available గా ఉందో లేదో తెలుసుకోండి అది ఎలా ఉంటే goddady వెబ్సైట్లోకి వెళ్లి సెర్చ్ బార్ లో మీరు అనుకున్న డొమైన్ నేమ్ enter చేసుకొని search చేయండి అలా చేసిన తర్వాత ఒకవేళ మీరు సెర్చ్  చేసిన డొమైన్ నేమ్ available గా ఉంటే దాన్ని కొనుక్కోండి


  • ఇప్పుడు మీరు వెబ్ సైట్ ని ఏ ప్లాట్ ఫాం ఆధారంగా క్రియేట్ చేసుకుంటారనేది ఎంచుకోవాలి
ఇంటర్నెట్ లో వెబ్ సైట్ ని స్టార్ట్ చేయడానికి ఎన్నో  platform s  ఉన్నాయి అయితే ఇప్పుడు ఎక్కువమంది వెబ్సైట్ ఓనర్స్ వాడే ఒక మంచి ప్లాట్ ఫాం గురించి తెలుసుకుందాం

How to create a website in telugu

ఇంటర్నెట్ లో ఉన్న మొత్తం వెబ్సైట్లో చాలా మటుకు wordpress ద్వారా website build చేసినవే  ఎందుకంటే ఇందులో మనకు ఎన్నో మంచి మంచి ఫీచర్స్ అలాగే మంచి seo  plug-ins తో పాటు ఒక ప్రొఫెషనల్  గా  లోక్ ఇచ్చే వెబ్సైట్ డెవలప్ చేయవచ్చు

ఇలా wordpress లో వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మనకి ఒక డొమైన్ నేమ్ మరియు హోస్టింగ్ కావాలి అయితే డొమైన్ నేమ్ అంటే ఏమిటి అది  ఎలా కొనాలి తెలుసుకున్నాం కదా ఇప్పుడు హోస్టింగ్ అంటే ఏమిటి హోస్టింగ్ ఎక్కడ కొనాలి అనేది ఇప్పుడు చూద్దాం

  • హోస్టింగ్ అంటే ఏమిటి?
How to create website in Telugu


హోస్టింగ్ అంటే ఏమిటో సింపుల్ గా చెప్పాలంటే వెబ్ సైట్ లో మీరు వ్రాసిన ఆర్టికల్స్ అనేవి కొన్ని ఫైల్స్  గా ఏర్పడి ఒక సర్వర్ లో స్టోర్ అవుతాయి ఇప్పుడు ఎవరైనా ఇంటర్నెట్లో మీ ఆర్టికల్స్ సర్చ్ చేస్తే ఆ సర్వర్లో స్టోర్ అయిన డేటా ని మీ ఆర్టికల్ ఎవరు సెర్చ్  చేశారు వారికి చూపిస్తుంది దీన్నే హోస్టింగ్ అంటారు
ఇప్పుడు మీ వెబ్సైట్ కనుక ఒక హోస్టింగ్ లేకపోతే మీ వెబ్ సైట్ అనేది ఇంటర్నెట్ లో కనబడదు

కాబట్టి మీరు ఒక మంచి హోస్టింగ్ అనేది తీసుకోవాలి అయితే మీకు ఇప్పుడు ఒక డౌటు రావచ్చు  హోస్టింగ్ ఎక్కడ తీసుకోవాలి అని ? Bluehost మరియు siteground  వంటి కంపెనీస్ యూజర్స్ కి మంచి హోస్టింగ్ నీ ప్రొవైడ్ చేస్తున్నాయి . అయితే తక్కువ ఖర్చులో మంచి హోస్టింగ్ పొందాలనుకుంటే  bluehost మంచిది అని చెప్తాను ఎందుకంటే ఈ bluehost కంపెనీ చాలా తక్కువ ఖర్చుతో ఒక మంచి హోస్టింగ్ ప్రొవైడ్ చేస్తున్నాయి అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఈ బ్లూ హోస్ట్ కంపెనీ వాళ్ళు తొందరగా సాల్వ్ చేస్తారు మరియు ఒక సమయంలో మంచి మంచి డిస్కౌంట్  ఆఫర్స్ పెట్టి చాలా తక్కువ డబ్బుతో మంచి హోస్టింగ్ ఫార్వర్డ్ చేస్తారు మీలో ఎవరికైనా నచ్చితే bluehost అయితే హోస్టింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి


ఇప్పుడు ఇలా మీరు  కొన్న డొమైన్ నేమ్ మరియు హోస్టింగ్ WordPress ఈ మూడింటిని connect చేయవలసి ఉంటుంది
ఇది పెద్ద కష్టతరమైన ప్రాసెస్ ఏం కాదు . ఈ పోస్ట్ లో చెప్పడానికి వీలు కాదు కాబట్టి  యూట్యూబ్ లో వీటీని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది చాలామంది చెప్తారు వాటిని చూసి మీరు కూడా సింపుల్ గా ఈ మూడింటినీ కనెక్ట్ చేసుకోండి అలా అంతా రెడీ అయిన తర్వాత మీరు ఆర్టికల్స్ రాయడం మొదలు పెట్టండి

సో ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి అలాగే మీకు ఈ పోస్ట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి థాంక్యూ సో మచ్




కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు